కాకతీయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (KUCEIT )లో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ముఖ్య అతిథిగా కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి హాజరై ప్రారంభించారు.
రక్తదానం ఒక గొప్ప సామాజిక సేవ: కేయూ ఉపకులపతి ప్రొఫెసర్ కె. ప్రతాప్ రెడ్డి
⏩కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రక్తదాన శిబిరం.. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు.. 93 యూనిట్ల రక్తం సేకరణ.
ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ..
రక్తదానం గొప్ప సామాజిక సేవ అని, ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడటంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 93 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని నిర్వాహకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయం NSS కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈ. నారాయణ, కేయూసెట్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్. రమణ, డా. వి. మహేందర్, డా.ch. రాధిక, డా. కె. సుమలత, డా. ఎం.డి. అసిమ్ ఇక్బాల్, డా. ఎన్. సత్యశివప్రసాద్, ఎస్. సుజాత, ఏఆర్. నేతాజీ తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎన్. రమణ మాట్లాడుతూ, రక్తదాన శిబిరాన్ని సమన్వయపరిచిన NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లు డా. ఎం. సౌజన్య, డా. డి. శైలజ, NCC ఆఫీసర్ లెఫ్టినెంట్ కె. విజయ్ కుమార్, డా. బి. అనిల్ కుమార్‌లను అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, విద్యార్థులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.