Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా?... అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా...

మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ ధ్వజం...

బీజేపీ గెలిచిందని ఆర్ వోబీపై నిర్లక్ష్యమా?... అవసరమైతే అసెంబ్లీలో ధర్నా చేస్తా...
Share Short Clip Download PDF

మాధవ్ నగర్ ధర్నాలో ఎమ్మెల్యే ధన్ పాల్ ధ్వజం...

నిజామాబాద్ (రైట్స్ మీడియా): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ గెలిచిందని మాధవ్ నగర్ ఆర్ఓబిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ధ్వజమెత్తారు. నగర శివారులోని మాధవనగర్ ఆర్ వోబీ పనుల జాప్యంపై మంగళవారం మహా ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

తాను ఇక్కడకి ఎమ్మెల్యేగా కాదని, మీలో ఒకడిగా మీ బాధను పంచుకోవడానికి వచ్చానన్నారు. ఈ మాధవ్ నగర్ గేటుతో నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొంది.

నిత్యం ఈ రోడ్డు మీదుగా అన్ని రకాల వాహనాలు సుమారు 4 నుంచి 5 వేల వరకు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు. అలాగే ప్రతిరోజు 24 గంటల్లో 58 రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీంతో ప్రతిసారి 15 నుంచి 20 నిమిషాల వరకు గేటు పడటం, భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు.
ప్రధానంగా ఈ సమస్యతో స్కూల్ పిల్లలు స్కూల్ కి లేట్... కూలీలు పనికి లేట్..రోగులు హాస్పిటల్ కి లేట్... ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగానికి లేట్... చివరికి శవాలు కూడా స్మశానానికి లేట్ గా వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

మాధవ్ నగర్ ఆర్ఓబిపై ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని గత ఏడాది కలిస్తే వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం ఇచ్చినట్లు గుర్తు చేశారు.కానీ ఇప్పటివరకు ఎందుకు పూర్తి కావడం లేదన్నారు. ఇది నిజామాబాద్ అర్బన్ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ

ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్ వోబీ కొరకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని కలిసి కేంద్ర నిధులు మంజూరు చేయించారన్నారు. రైల్వే శాఖ తనవంతు పని పూర్తి చేసిందని, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.