కరీంనగర్ (రైట్స్ మీడియా): ప్రధాని మోదీ జన్మ దినోత్సవము, సేవా సంకల్ప్ అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా బుధవారం రోజున బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలోకరీంనగర్ లో 'సంకల్ప సభ', 'సేవా జ్యోతి' కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కేంద్ర మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రోగ్రాంలో భాగంగా ముందుగా కరీంనగర్లోని తెలంగాణ చౌక్ నుండి హౌసింగ్ బోర్డ్ చౌరస్తా వరకు బీజేపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చౌరస్తా వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక స్క్రీన్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ల సందేశాన్ని వర్చువల్ బీజేపీ శ్రేణులు ఆసక్తిగా వీక్షించారు.
పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై ప్రధాని మోడీ చేసిన సూచనలను పార్టీ శ్రేణులు ఆలకించారు. 'వికసిత్ భారత్' లక్ష్యానికి అనుగుణంగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించి, దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి , డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ బిజెపి ఇన్చార్జి , రాష్ట్ర నాయకులు చిరంజీవి, మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, పార్లమెంట్ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు, వివిధ మోర్చాల అధ్యక్షులు సంఘ నరేష్, నిర్మల రెడ్డి, శ్రీనివాస్ నాయక్, బత్తుల లక్ష్మీనారాయణ, ఆకుల రాజేందర్, మోతే గంగారెడ్డి లతోపాటు కార్పొరేటర్లు, జోన్, మండల అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.