ధరణి మారినా ధోరణి మారకపోగా.. భూభారతి తీసుకువచ్చి భూహారతి చేస్తున్నారు. మల్కాజిగిరి మినీ ఇండియా ఇక్కడ అన్ని రాష్ట్రాల, ప్రాంతాల వారున్నారు. రేవంత్ పుణ్యమా అని వందల కాలనీలు 22ఏ కింద నిషేధిత జాబితాలోకి వెళ్ళాయని ఎంపి ఈటల రాజేందర్ అన్నారు.
ప్రపంచ చరిత్ర హిట్లర్ ను దుర్మారుడుగా గుర్తు పెట్టుకుంటే, తెలంగాణ రేవంత్ రెడ్డిను గుర్తుపెట్టుకుంటుంది. చివరికి పి అండ్ టి కాలనీ, మహేంద్రహిల్స్ 22ఏ కింద పెట్టారు. అమ్ముకోకుండా, బ్యాంకులోనుకి పోకుండా చేస్తున్నారు. ఇది ఒక తుగ్లక్ పాలన అని ప్రజలంటున్నారు. 22ఏ ను రద్దు చేయమని అడగడం లేదు. పేదల భూములు, ఇళ్లను జాబితా నుండి తొలగించమని అడుగుతున్నాం. తప్పు అధికారులు చేస్తే వారిని సర్వీస్ నుండి తొలగించండి. మీరు చేస్తే రాజీనామా చేయండి. 90 లక్షల మంది బాధితులున్నారు. నంగనాచి మాటలు బంద్ చేసి నిషేధాన్ని తొలగించాలి. ఇందిరాపార్క్ వద్ద 5, 6 వ తేదీల్లో బీజేపీ ఎంపీ, ఎంపీలు దీక్ష చేస్తున్నాం. ఐదవ తేదీ ఉదయం 10 గంటల వరకు వేలాదిగా తరలి రావాలని ప్రజలను, బాధితులను కోరుతున్నామని అన్నారు.