శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులు, ప్రసూతి విభాగం, ఐసీయూ, రక్త పరీక్షల ల్యాబ్‌లను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందులు, ఆసుపత్రిలోని సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యసేవలకు వచ్చే ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించిన కలెక్టర్ పరిశుభ్రంగా ఉందని అభినందించారు. రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కొత్త నియామకాల ద్వారా వైద్యులు, సిబ్బంది అందుబాటులోకి రావడం, మాతా శిశు సంరక్షణ సేవలు, ప్రసవాల సంఖ్య పెరుగుతుండటం పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రోగుల నమూనాలను టీ-హబ్‌కు పంపించి పరీక్షల నివేదికలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చిన మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు.
బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు అవసరమైన పరికరాలు కొరకు ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. కోసం ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్లు (ILR) మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వార్డుల్లో ర్యాక్‌లు, డిస్పోజల్ కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గత నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అల్ట్రాసౌండ్ మిషన్ ప్రోబ్ సమస్యను పరిష్కరించి, యంత్రాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
మహదేవ్‌పూర్ సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్, నియామకానికి మీకు తెలిసిన మిత్రులు ఉంటే నియామకానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. పాము, తేలు వంటి విష జంతువుల మందులు, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఈ తనిఖీలో ఆసుపత్రుల సమన్వయ అధికారి డా శ్రీకాంత్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ వసంత రావు వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ