ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా హనుమకొండ టీచర్స్ కాలనీ ఫేజ్-1లోని ప్రగతి మిత్ర కమ్యూనిటీ హాల్‌లో ఆయుర్వేద మెగా శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి ముఖ్య అతిథిగా హాజరై ఆయుర్వేద మెగా క్యాంప్‌ను ప్రారంభించారు.
ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనం.. ఆయుర్వేద వైద్య విధానం
⏩ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ..
భారతీయ ఆయుర్వేద వైద్య విధానంలో అనేక వైద్య విధానాలు ప్రజల విశ్వాసాన్ని పొంది ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితులలో ఆయుర్వేదం యొక్క గొప్పదనం, విశిష్టత, మానవాళిని రక్షించడంలో ఆయుర్వేదం అందించిన సేవల గురించి వివరించారు. ఆయుర్వేద మెడికల్ క్యాంపులో సుమారు 312 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అలాగే యోగా ద్వారా రోగాలను ఎలా నియంత్రించుకోవాలో యోగా ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆయుష్ విభాగం ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ ప్రమీలా దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, జిల్లా ఆయుష్ ఇన్చార్జి డాక్టర్ ఎస్. మహేంద్ర కుమార్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ భానుప్రకాష్, డాక్టర్ పి. వీరారెడ్డి, కాలనీ అధ్యక్షులు రామ్ రెడ్డి, సీనియర్ వైద్యులు డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ రావుల జగదీశ్వర్ ప్రసాద్, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ జయప్రకాశ్, డాక్టర్ అల్లం సర్వేశం, డాక్టర్ మాధవి, డాక్టర్ కుమార్, డాక్టర్ కోక్య, ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు, యోగా ప్రచారకులు, ఎస్ఎన్ఓలు, యోగా ఇన్‌స్ట్రక్టర్లు ప్రభు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.