బాలల రక్షణ, సంరక్షణ కోసం కృషి చేయాలని హనుమకొండ జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి అన్నారు.
మంగళవారం హనుమకొండ జిల్లాలో ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలల సంరక్షణ కేంద్రాలను (చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్) ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి తనిఖీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్షన్ కమిటీ బృందంతో కలిసి తనిఖీ చేశారు.
ఇందులో భాగంగా సాయి సేవా ట్రస్ట్, ఒయాసిస్ ట్రస్ట్, మల్లికాంబా మనో వికాస బాలురు బాలికల కేంద్రం, రీచ్, కేర్ అండ్ షెల్టర్ ప్రత్యేక దత్తత కేంద్రం (మహిళాభి శిశు సంక్షేమ శాఖ అనుబంధ సంస్థ శిశు గృహ)లను తనిఖీ చేశారు.