Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

సర్వే విధానం, భూ రికార్డులను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

సర్వే విధానం, భూ రికార్డులను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్
Share Short Clip Download PDF

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్ గ్రామంలో కొనసాగుతున్న నాన్‌-కెడస్ట్రల్ భూముల రీసర్వే ప్రక్రియను రెవెన్యూ అదనపు కలెక్టర్ పి. అశోక్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రీసర్వే పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో చేపడుతున్న సర్వే విధానం, భూ రికార్డులను ఆయన తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..

రీసర్వే ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ సర్వే పనులను వేగవంతం చేయాలని సూచించారు.
రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సర్వే బృందాలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. భూముల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించి, రికార్డుల్లో ఎలాంటి తప్పిదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. రీసర్వే అనంతరం రూపొందించే డిజిటల్ భూ రికార్డులు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఎడి కుసుమ కుమారి, తహసీల్దార్ స్వరూపరాణి, రెవెన్యూ, సర్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.