సంఘమిత్ర ఫ్లైఓవర్ పై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతూ మరమ్మతుల నిమిత్తం ఆగి ఉన్న లారిని మరొక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. లారీలో ఉన్న డ్రైవర్ కిందకి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఢీకొట్టిన వాహనంలో ఇద్దరు మహిళలు ఇరుక్కుని మృతి చెందారు. మృతులు అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(27), తిరుపతమ్మ (24)గా పోలీసులు గుర్తించారు
ఒంగోలులో యాక్సిడెంట్.. ఇద్దరు పల్నాడు మహిళలు మృతి