Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతల స్వీకరణ

అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం.. శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు.

కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతల స్వీకరణ
Share Short Clip Download PDF

• పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

• కుడా చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి అభినందనల వెల్లువ.

కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) ఛైర్‌పర్సన్‌గా గుండు సుదారాణి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
హనుమకొండలోని కుడా కార్యాలయంలో నిర్వహించిన పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా.... ఛాంబర్ లో అధికారికంగా కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి పదవీ బాధ్యతలు చేపట్టారు.

వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్ పూర్, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కుడా వైస్ చైర్మన్/ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, తదితరుల సమక్షంలో కుడా ఛైర్ పర్సన్ గా గుండు సుధారాణి బాధ్యతలు స్వీకరించారు.

బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణి కి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ పుష్పగుచ్చాలు, పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండు సుదారాణి మాట్లాడుతూ...

తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్బంగా కుడా సిపిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పాల్గొని నూతనంగా కుడా చైర్‌పర్సన్‌ గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుధారాణికి అభినందనలు తెలిపారు.