వరంగల్ జిల్లా మామునూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో బెస్తం చెరువు కట్ట దగ్గర ఓ యువకుడు హత్యకు గురైనట్లు సమాచారం. మృతుడు తిమ్మాపూర్‌కు చెందిన గౌతమ్‌గా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఓ నిందితుడిని మామూనూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
బెస్తం చెరువు కట్ట దగ్గర యువకుడి మర్డర్ కలకలం