నిజామాబాద్ (రైట్స్ మీడియా): చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన 80 ఏళ్ల వృద్ధుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నిజామాబాద్ స్పెషల్ ఫోక్సో కోర్టు ఇన్ఛార్జి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహారెడ్డి తీర్పునిచ్చారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన కాలే పాండురంగా అనే 80 ఏళ్ల వృద్ధుడు 2021 మార్చి 17న ఎనిమిదేళ్ల బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరంపై బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితుడిపై నేర అభియోగాలు స్పష్టంగా రుజువయ్యాయి.

దీంతో న్యాయమూర్తి దుర్గాప్రసాద్ ముద్దాయి కాలే పాండురంగాకు 20 ఏళ్ల జైలు శిక్షతో, 5 వేల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలైన బాలికకు నిజామాబాద్ న్యాయసేవాధికార సంస్థ ద్వారా 2 లక్షల నష్టపరిహారం అందించాలని తీర్పులో సిఫార్సు చేశారు.