జిడబ్ల్యూఎంసీ, అక్టోబర్ 31(రైట్స్ మీడియా): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్న జాతీయ ఐక్యతా దినోత్సవం, విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో భాగంగా శనివారం ఉదయం వరంగల్ నగరంలో నిర్వహించిన 5కె, 10కె వాక్ అండ్ రన్ కార్యక్రమాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్నతో కలిసి సీపీ కార్యాలయ ఆవరణలో జెండా ఊపి ప్రారంభించారు.
సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మట్టెవాడ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగి, అక్కడి నుంచి తిరిగి సీపీ కార్యాలయ ఆవరణకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ వర్గాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.