చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామం కు చెందిన కూలీలు ప్రతి రోజు వరి నాట్లు వేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే వరి నాట్లు వేయడానికి వెళ్లిన కూలీలు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వరి పొలంలో జాతీయ జెండాను ఏర్పాటు చేసుకుని జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలు ఆలపించి దేశభక్తిని ప్రదర్శించారు. దేశం అంటే కూలీలకు ఉన్న ప్రేమను చూసి పలువురు అభినందిస్తున్నారు..