భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ కార్యాలయం *“కమల నిలయం”*లో బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా Dr. బోగ శ్రావణి మాట్లాడుతూ...
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమైక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, కౌన్సిలర్లు సిరిపురం శ్రీలత శ్రీనివాస్, గట్టిపెళ్లి మానస–జ్ఞానేశ్వర్, నిమ్మల నాగరాజు, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్టి మమత, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నారపాక అశోక్, జిల్లా, మండల, పట్టణ పదాధికారులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.