Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం లారీ పట్టివేత

సుమారు 30 టన్నుల PDS బియ్యం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యం లారీ పట్టివేత
Share Short Clip Download PDF

632 పాలిథిన్ కవర్లలో అక్రమంగా తరలింపు

పిట్లం పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు NH-161 మీదుగా అక్రమంగా PDS బియ్యం తరలిస్తున్న లారీని పిట్లం పోలీసులు పట్టుకున్నారు.
పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్‌లతో కలిసి పిట్లం చౌరస్తా సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న GJ-25-U-7022 నంబర్ గల లారీని ఆపి తనిఖీ చేశారు.
లారీలో 632 పాలిథిన్ కవర్లలో సుమారు 30 టన్నుల PDS బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించి లారీ డ్రైవర్లు పర్బత్ కరంటా దేవరాజ్, వయస్సు 52 సంవత్సరాలు, నివాసం బర్దోలి, సూరత్ జిల్లా, గుజరాత్; శరద్ ఆబా బచ్‌కర్, నివాసం ధూలే జిల్లా, మహారాష్ట్రతో పాటు బియ్యం తరలిస్తున్న వ్యక్తి ఇబ్రహీం, హైదరాబాద్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర, IPS, పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది వెంకటేష్, రాజేశ్వర్‌లను అభినందించారు. అక్రమంగా తరలిస్తున్న PDS బియ్యాన్ని సమర్థవంతంగా పట్టుకుని స్వాధీనం చేసుకున్నందుకు వారి పనితీరును ప్రశంసించారు.
ప్రజలకు పంపిణీ చేయాల్సిన PDS బియ్యాన్ని అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.