మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక లకారం ట్యాoక్ బండ్ వద్ద నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, సామాజిక సమానత్వం, బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం, సామాజిక సమానత్వం కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని అన్నారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం కోసం ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, డాక్టర్ రాజశేఖర్ గౌడ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. జానయ్య, నాయకులు అమరగాని వెంకన్న గౌడ్, కత్తి నెహ్రూ గౌడ్, పోలంపల్లి నాగరాజు గౌడ్, బండి నాగేశ్వరరావు గౌడ్, గజ్జెల్లి వెంకన్న, నూతి సత్యనారాయణ గౌడ్, వూడుగు శ్రీనివాస్ గౌడ్, బొలిగాని శ్రీనివాస్ గౌడ్, బిచ్చాల తిరుమలరావుగౌడ్, మారగాని సుదర్శన్ గౌడ్, బెల్లంకొండ శరత్ గౌడ్, మూడు ముంతల గంగరాజు గౌడ్, కొమిలి శ్రీనివాస్ గౌడ్, జి. శ్రీనివాసరావు, మార్కం లింగయ్య గౌడ్, దాసరి శ్రీరాములు గౌడ్, అల్లిక అంజయ్య, పగడాల నాగరాజు, గుడిద శ్రీనివాస్, వట్టికూటి ఉమాదేవి, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, రుద్ర ప్రదీప్, మొక్క శేఖర్ గౌడ్, బిసి కుల సంఘ నాయకులు, వెనుకబడిన తరగతుల కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకోవాలి: ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి
సామాజిక సమానత్వం, బడుగు–బలహీన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు.