హుజూరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12, 2026 (శనివారం) నాడు అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించబోయే "రిలే నిరాహార దీక్ష" కు సంబంధించిన గోడపత్రికను (పోస్టర్) టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి Dr.ఎనుగు మల్లారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సన్నాహక సమావేశంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హుజూరాబాద్‌లో దళిత బంధు లబ్ధిదారుల కోసం రిలే నిరాహార దీక్ష గోడపత్రిక విడుదల
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ
"దళిత బంధు రానీ మరియు రెండో విడత పెండింగ్ లబ్ధిదారులకు అండగా ఉండటానికే ఈ రిలే నిరాహార దీక్షను చేపడుతున్నాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మి దళిత సోదరులు ఎవరూ మోసపోవద్దు. వారు మీ జీవితాలతో ఆడుకుంటున్నారు. “ దళిత బంధు అనేది ఎవరిచ్చిన భిక్ష కాదు, అది మన ఆత్మగౌరవం”, లబ్ధిదారులందరికీ న్యాయం జరిగే వరకు మా తెలంగాణ రక్షణసేన పోరాటం ఆగదు. ఈ శనివారం (సెప్టెంబర్ 12) హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద జరగబోయే ఈ రిలే నిరాహార దీక్షకు దళిత బంధు లబ్ధిదారులు, యువత మరియు ప్రజలందరూ భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని" పిలుపునిచ్చారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్ యాదవ్, కోరపల్లి సురేష్, హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన TRS నాయకులు అంబాల హరీష్, కిరణ్ , నరేష్ , రితీష్, యువజన విభాగం (యూత్) నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.