లంచం తీసుకుంటుండగా ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు రెడ్ హ్యాండెడ్ గా సీబీ అధికారులకు పట్టుబడ్డారు. అందులో ఓ జూనియర్ అసిస్టెంట్ పాల్దా అశోక్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కలకంట్ల కిరణ్ కుమార్ వున్నారు. దీంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పాల్దా అశోక్ జూనియర్ అసిస్టెంట్ గా , కలకంట్ల కిరణ్ కుమార్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఓ మహిళకు సంబంధించిన పెన్షన్ మంజూరు కోసం ఆమె సర్వీస్ బుక్‌లో ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ తయారు చేసి, అవసరమైన ఎంట్రీలు, ఇతర వివరాలను నమోదు చేయడం కోసం ఇద్దరు ఉద్యోగులు 15 వేల లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆ మహిళ కుమారుడు ఏసీబీ అధికారులకు ఆశ్రయించారు.
పక్కా పథకం ప్రకారం జూనియర్ అసిస్టెంట్ అశోక్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి కిరణ్కుమార్ నగరంలోని సీతారామ్‌నగర్ కాలనీలో ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.