అమెరికాలో హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ పై ట్రంప్ యంత్రాంగం ఆంక్షలు కఠినతరం చేస్తోంది. వీసా వ్యవస్థలో జరుగుతున్న దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

శుక్రవారం వైట్ హౌస్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ , ప్రొక్లమేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం.. అమెరికా విదేశాంగ, కార్మిక, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలు ఇకపై హెచ్-1బి దరఖాస్తులను మరింత కఠినంగా పరిశీలిస్తాయి. ముఖ్యంగా, స్థానిక అమెరికన్ ఉద్యోగులను ఇటీవల ఉద్యోగాల నుంచి తొలగించిన లేదా తొలగించాలని ప్లాన్ చేస్తున్న కంపెనీలు దరఖాస్తు చేస్తే.. ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా స్క్రూటినీ చేయాలని ఆదేశించారు.

అంతేకాకుండా, కొన్ని నిర్దిష్ట హెచ్-1బి వీసా పిటిషన్ల కోసం 1,00,000 డాలర్ల భారీ ఫీజు నిబంధనను యంత్రాంగం పునరుద్ధరించింది. స్థానిక కార్మికుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం.. అమెరికాలోని టెక్ కంపెనీలు, విదేశీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.