బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన హత్య ఘటన చోటుచేసుకుంది. లభించిన సమాచారం ప్రకారం, 21 ఏళ్ల మొహమ్మద్ సలాం పై 21 ఏళ్ల రెహానా హత్య కేసు నమోదు చేసారు. ఇద్దరూ ఒకే ఫంక్షన్ హాల్లో పనిచేస్తున్నారు. రెహానా, దాదాపు ఒక సంవత్సరం నుంచి సలాం తో ప్రేమ సంబంధంలో ఉండి, బక్రీద్ సమీపం నుంచి బిస్మిల్లా కాలనీలో సలాంతో కలిసి నివసిస్తున్నట్లు బంధువులు చెబుతున్నారు.

పోలీసుల సమచారం ప్రకారం, ఆదివారం అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రెహానాను హతమార్చి బ్యాగులో పెట్టి పారిపోవడానికి ప్రయత్నించాడు. హత్య అనంతరం మృతదేహాన్ని ఒక గోనె సంచిలో పెట్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అదే సమయంలో బాలాపూర్ పోలీసులు మొహమ్మద్ సలాంను పట్టుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, హత్యకు గల అసలు కారణాలు మరియు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.