గ్రేటర్ వరంగల్ మహా నగరానికి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రాజెక్ట్ కు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర సీడీఎంఏ డాక్టర్ టి.కే శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి గ్రేటర్ వరంగల్ మహా నగరంలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్ సంబంధిత అంశాలు, టెండర్ ప్రక్రియ, పనులు చేపట్టే విధానంపై వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, కమిషనర్ టి. వెంకన్న, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు హాజరయ్యారు.