*సత్తుపల్లి మునిసిపల్ పరిధిలో రూ.1.83 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.
*రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన, రూ.1.43 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
--------------------------
ప్రజారోగ్యం, విద్యారంగాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 1.83 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.