హనుమకొండ(రైట్స్ మీడియా): జిల్లాలో వివిధ దశల్లో ఉన్న వీవో భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వీవో భవనాలు, రుణాల వసూళ్లు, మహిళా డెయిరీ, తదితర అంశాలపై డీఆర్డీఏ, సెర్ప్, స్త్రీనిధి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా వీవో భవన నిర్మాణాల పురోగతి, రుణ వసూలు, డిఆర్డిఏ, సెర్ప్, స్త్రీనిధి సంబంధిత అంశాలపై డీపీఎంలు, ఏపీఎమ్ లను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
వీవో భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలి
⏩రుణాల వసూలులో పురోగతి సాధించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
⏩హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో వీవో భవనాలు, రుణాల వసూళ్లు, తదితర అంశాలపై డీఆర్డీఏ, సెర్ప్, స్త్రీనిధి అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
బ్యాంకు లింకేజీ రుణాల వసూలు వంద శాతం చేయాలన్నారు. ఎన్పీఏ శాతం జీరో గా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలన్నారు. పరకాల మహిళా డెయిరీని సాధ్యమైనంత వరకూ త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ మేన శ్రీను, అడిషనల్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు, డీపీఎంలు రాజేంద్రప్రసాద్, సరిత, పద్మప్రియ, అనిత, దయాకర్, స్త్రీనిధి ఆర్ఎం రమేష్, ఏపీఎంలు పాల్గొన్నారు.