Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకం

⏩క్రీడల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలి: హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకం
Share Short Clip Download PDF

హనుమకొండ(రైట్స్ మీడియా): విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి క్రీడలు ఎంతో కీలకంగా నిలుస్తాయని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో 70వ హనుమకొండ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) అంతర్ పాఠశాల క్రీడా పోటీలను జవహర్ లాల్ నెహ్రూ మైదానంలో ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అంతర్ పాఠశాలల క్రీడా పోటీల ముగింపు కార్యక్రమము మంగళవారం హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కబడ్డీ, ఖో-ఖో,వాలీబాల్ క్రీడల్లో అండర్-14, అండర్-17 బాలురు, బాలికల విభాగాల్లో పోటీలలో విన్నర్, రన్నర్లకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనాలని, క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు. హనుమకొండ జిల్లాలో నిర్వహించిన కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ క్రీడల్లో అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల నిర్వహించిన పోటీల్లో విద్యార్థి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు.
క్రీడలు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎంతో దోహదపడతాయని, పాఠశాల స్థాయి నుంచే క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు తగిన శిక్షణ, అవసరమైన సౌకర్యాలు కల్పించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీలను విజయవంతంగా నిర్వహించిన విద్యాశాఖ అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లు, పాల్గొన్న క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్. వి. గిరిరాజ్ గౌడ్, జిల్లా యువజన, క్రీడల అధికారి కొత్త ప్రశాంత్, ఎస్ జి ఎఫ్. అండర్ 14 అండ్ 17 కార్యదర్శి వి వాసుదేవరావు, పేటా టిఎస్ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి , టిజిపేట అధ్యక్షులు పార్థసారథి వివిధ మండల కార్యదర్శులు క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయమా ఉపాధ్యాయులు, కోచులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ