70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నల్లబెల్లి, దుగ్గొండి జోనల్ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని రుద్రగూడెం ఓ ప్రైవేట్ స్నికూల్ లో నిర్వహించిన అండర్-14, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలను నల్లబెల్లి మండల విద్యాశాఖ అధికారి ఎం. అనురాధ ప్రారంభించారు.
ఈ పోటీల్లో దుగ్గొండి, నల్లబెల్లి మండలాల నుండి 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 144 మంది క్రీడాకారులు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని ఎంఈఓ అనురాధ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ పుల్లూరి శ్రీనివాస్ గౌడ్, జోనల్ సెక్రటరీ టి. నాగరాజు, పీఈటీ, పీడీలు గుండేటి రవీందర్ గౌడ్, శంకరయ్య, లింగమూర్తి, వెంకన్న, కళ్యాణి, లావణ్య, పాఠశాల వ్యవస్థాపకులు కమలాకర్ రావు, రాజిరెడ్డి, ప్రిన్సిపాల్ రణధీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.