వరంగల్ జిల్లా నర్సంపేట మండల మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు మాదన్నపేట గ్రామంలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. గొర్ల మందపై దాడి చేసి 16 గొర్రెలను పొట్టన పెట్టుకున్నాయి. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది.
వివరాల్లోకి వెళితే... మాదన్నపేట గ్రామానికి చెందిన కేశెట్టి శ్రీనివాస్ కు చెందిన గొర్రెల మందపై 2-3 వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. మందలో ఉన్న చిన్న పిల్లలు, గొర్రెలు తప్పించుకోలేకపోయాయి. సుమారు రూ. 2లక్ష 50వేల విలువైన 16 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 4 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. విషయం తెలుసుకున్న మొదటి వార్డు కౌన్సిలర్ కొత్తకొండ మేఘన శ్యామ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గొర్ల కాపరి శ్రీనివాస్ కుటుంబానికి ఇదే జీవనాధారం అని, ఒక్కసారిగా ఇంత నష్టం జరగడం బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు.
మాదన్నపేటలో వీధి కుక్కల బీభత్సం: 16 గొర్రెలు మృతి
*బాధితుడిని పరామర్శించిన వార్డు కౌన్సిలర్.. *కొత్తకొండ మేఘన శ్యామ్.
ప్రభుత్వం ఆదుకోవాలి: MCPI U జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
ఈ ఘటనపై వరంగల్ జిల్లా mcpi u కార్యదర్శి పెద్దారపు రమేష్ స్పందించారు.బాధిత గొర్ల కాపరి కేశెట్టి శ్రీనివాస్ ను ప్రభుత్వం తరపున ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. పశు సంవర్ధక శాఖ ద్వారా నష్టపరిహారం అందించి, మానవతా దృక్పథంతో సహాయం చేయాలని కోరారు. నర్సంపేట పరిసరాల్లో ఇది మొదటి ఘటన కాదు. గత నెలలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అని అన్నారు .బాధితుడు కేశెట్టి శ్రీనివాస్ కు ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.