దుగ్గొండి, నల్లబెల్లి మండలాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఎస్జీఎఫ్ అండర్–14, అండర్–17 బాలురు, బాలికల కబడ్డీ, కోకో, వాలీబాల్ క్రీడా ఎంపికలు ఈ నెల 19న శనివారం ఉదయం 10 గంటలకు రుద్రగూడెంలోని కాకతీయ బ్రిలియంట్ స్టార్స్ స్కూల్ (KBHS)లో నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి ఎం. అనురాధ, జోనల్ సెక్రెటరీ టి. నాగరాజు (SA–Physical Education) తెలిపారు. అర్హత కలిగిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని వారు కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. అండర్–14 విభాగానికి 01-01-2013 తర్వాత జన్మించిన వారు, అండర్–17 విభాగానికి 01-01-2010 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు.
ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలకు రంగం సిద్ధం
⏩దుగ్గొండి–నల్లబెల్లి మండలాల విద్యార్థులకు కబడ్డీ, కోకో, వాలీబాల్ పోటీలు.