తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి. అలాగే జాతీయ అధ్యక్షులు ఖర్గే పై బీజేపీ పార్టీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ మరియు విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ఉపయోగించిన ఘటనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసారు. బీజేపీ వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాష్ట్ర కార్యాలయంకు నల్లరంగులు పూసి నిరసన తెలిపి ఆఫీస్ ఎదుట బీజేపీ పార్టీ జెండాతో పాటు అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిరసనను పోలీసులు అడ్డుకుని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డితో పాటు పలువురు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడి