వరంగల్ నగరంలోని వడ్డేపల్లిలో ఉన్న పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను పరిశోధన కేంద్రంగా గుర్తిస్తూ కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా, వరంగల్ నగరంలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లోని మైక్రోబయాలజీ విభాగాలకు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్లు డా. జి. రేణుక, డా. పి. పల్లవిలను పరిశోధన పర్యవేక్షకులుగా (Research Supervisors) గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య శ్రీనివాస్, పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య చంద్ర మౌళిని విశ్వవిద్యాలయ అధికారులు అభినందించారు. ఈ నిర్ణయంతో ఆయా కళాశాలల్లో పరిశోధన కార్యకలాపాలకు మరింత ప్రోత్సాహం లభించడంతో పాటు, విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో మెరుగైన అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఆచార్య బి. వెంకటరాం రెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్ కట్ల, దూరవిద్య కేంద్ర సంచాలకులు ఆచార్య బి. సురేష్‌లాల్, మైక్రోబయాలజీ విభాగాధిపతి ఈ. సుజాత, డా. జి. సుహాసిని, డా. కే. రజనీలత తదితరులు పాల్గొన్నారు.
పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు పరిశోధన కేంద్రం హోదా: కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ప్రతాప్ రెడ్డి