తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో డిగ్రీ కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని బీజేపీ నేత ఎన్. రాంచందర్రావు అన్నారు. ఏళ్లుగా బకాయిలు పేరుకుపోవడంతో కాలేజీలు సిబ్బంది జీతాలు, రోజువారీ ఖర్చులు భరించలేకపోతున్నాయని తెలిపారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.