Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్..

కళాకారులకు ఇచ్చిన హామీలను  నెరవేర్చాలి: సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్..
Share Short Clip Download PDF

పెద్దపల్లి(రైట్స్ మీడియా): తెలంగాణ ఉద్యమంలో తమ ఆట, పాటలతో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం డిమాండ్ చేశారు. బుధవారం రోజున పెద్దపల్లి బస్టాండ్ సమీపంలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నిరుద్యోగ కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలు ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో పెట్టిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష కు సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మద్దతు తెలిపారు.

సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో నిరుద్యోగ కళాకారులు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రజలను చైతన్యపరిచారని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సాంస్కృతిక సారథిలో 1000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, కళాకారులు న్యాయమైన డిమాండ్ల కోసం నిరాహార దీక్షలు చేయాల్సి రావడం విచారకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించి, వారి డిమాండ్లను పరిష్కరించకపోతే సిపిఐ పార్టీ తరఫున కళాకారుల పోరాటానికి అన్ని వేళలా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సీపీఐ పట్టణ కార్యదర్శి కల్లేపల్లి నవీన్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు. ఎండి రజాక్. తుంగాని. రాకేష్ రాష్ట్ర సోషల్ మీడియా ఇన్ఛార్జ్. దబ్బేట పుష్పలత రాష్ట్ర కల్చరల్ ఇంచార్జ్. కలవేని రాణి రాష్ట్ర ఆర్గనైజర్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు. కన్నూరి ఆంజనేయులు తెలంగాణ ఉద్యమ కళాకారుడు గాజుల రమేష్ తెలంగాణ ఉద్యమ కళాకారుడు దుబాసి శ్రీనివాస్. పులిపాక బానిష్ నిట్టూరు సరూప. బట్టల గీత పెండెం కళ్యాణి పాల్గొన్నారు.