ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..
జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థలలో పిల్లల అడ్మిషన్లను పెంచాలని సూచించారు, విద్యాశాఖ బలోపేతం కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాథమిక కల్పిస్తుందని తద్వారా పూర్తిస్థాయిలో కేజీవీబీలు, మోడల్ స్కూల్స్, జిల్లా పరిషత్, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పిల్లల అడ్మిషన్లను పెంచి వారికి నాణ్యమైన విద్యను అందించాలని, సూచించారు, “LEAP – Learn English through Active Participation” పుస్తకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్. విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన “LEAP – Learn English through Active Participation” పుస్తకాన్ని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ శుక్రవారం జరిగిన MEOల సమీక్షా సమావేశంలో ఆవిష్కరించారు.
విద్యార్థులు ఆంగ్ల భాషను కేవలం పాఠ్యాంశంగా కాకుండా వినడం (Listening), మాట్లాడటం (Speaking), చదవడం (Reading), రాయడం (Writing), చురుకైన భాగస్వామ్యం (Participation) ద్వారా ఆచరణాత్మకంగా నేర్చుకునేలా ఈ పుస్తకాన్ని రూపొందించారు. తరగతి గదిలో విద్యార్థుల చురుకైన భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఆంగ్లంలో మాట్లాడే ధైర్యాన్ని మరియు రోజువారీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. “ఆంగ్ల భాషలో నైపుణ్యం విద్యార్థులకు ఉన్నత విద్య, ఉపాధి మరియు భవిష్యత్ అవకాశాలకు మరిన్ని ద్వారాలు తెరుస్తుంది. ప్రతి విద్యార్థి ఆంగ్లంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా పాఠశాల స్థాయిలో నిరంతర సాధనకు ప్రాధాన్యత ఇవ్వాలి” అని సూచించారు. “Better English – Better Future – Stronger Communities” అనే లక్ష్యంతో LEAP కార్యక్రమాన్ని జిల్లాలో విస్తృతంగా అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేసి, విద్యార్థుల్లో ఆంగ్ల కమ్యూనికేషన్ సామర్థ్యాలను పెంపొందించేందుకు MEOలు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ మూర్తి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్ , ACGE రాములు, DSO అప్పారావు, కోఆర్డినేటర్లు పూర్ణచందర్, సురేష్, వెంకటేశ్వర్లు, గాయత్రి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.