వాతావరణ సూచనల నేపథ్యంలో జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా..ప్రజలు అప్రమత్తం గా ఉండాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.

జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వంతెనలు, చెరువులు, జలాశయాలు, రోడ్లు, పాత భవనాలు, తదితర సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, విషయ సూచికలు ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ప్రజలు అవసరమైతే తప్ప బయటకి రాకూడదన్నారు.

వర్షాలు, వరదలు వల్ల అత్యవసర సహాయం నిమిత్తం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉంటారని, ఏదైనా అవసరం ఉంటే 18004251115 నెంబర్ కి
తక్షణమే సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఇరిగేషన్, విద్యుత్, సంబంధిత అన్ని విభాగాల సిబ్బంది అప్రమత్తంగా సమన్వయంతో వ్యవహరించాలని, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ఎదుర్కొని ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.