తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్ అందిస్తామని మంత్రి సీతక్క శాసనమండలిలో స్పష్టం చేశారు. ప్రస్తుతం 4,66,351 మంది పింఛన్లు పొందుతున్నారన్నారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించామని, దరఖాస్తుల స్వీకరణకు సెప్టెంబర్ 15 వరకు అని తెలిపారు. 1,23,199 దరఖాస్తులు వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని, క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత అర్హులకు మంజూరు
చేస్తామని చెప్పారు. తాత్కాలిక సర్టిఫికెట్లు ఇచ్చే విధానం అమలు చేస్తున్నామని చెప్పారు. హార్ట్ పేషెంట్లకు కూడా పింఛన్లు అందిస్తున్నామని, అనర్హులకు మంజూరైన పింఛన్లను తొలగిస్తున్నామని పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పింఛన్: మంత్రి సీతక్క