వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వర స్వామివారి ప్రతిమకు మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ పాలకుర్తి సారంగపాణి స్వామివారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో వర్ధన్నపేట మున్సిపాలిటీ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
వినాయక చవితి పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యువత, నిర్వాహకులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేతావత్ శిభారాణి - రాజేందర్, నాయకులు అనిమిరెడ్డి రాంచంద్ర రెడ్డి, మాలోతు సుమన్, ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యులు రోహిత్, సాయి కుమార్, శ్రీకాంత్, నాగరాజు విజయ్, విమాల్, అనురగ్, చరణ్, కిషోర్, రఘు, శేషు, అజయ్, సంజయ్ వేదాంత్, సాయి తేజ, కిరణ్ యువత, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.