Wednesday, 04 November 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు నాయిని..

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు నాయిని..
Share Short Clip Download PDF

హనుమకొండ(రైట్స్ మీడియా): జిల్లా కేంద్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేయి స్తంభాల గుడి రుద్రేశ్వరాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి బుధవారం పరిశీలించారు.

ప్రతి సంవత్సరం సొంత ఖర్చులతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమ్మవారి పూజా వేదిక, అలంకరణలు, భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. కేంద్ర పురావస్తు శాఖ (ASI) ఆధీనంలో ఉన్న ఆలయం కావడంతో, ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను సంబంధిత పురావస్తు శాఖ అధికారులకు తెలియజేశారు. ఆలయ ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అనుమతులు, ఇతర అంశాలపై అధికారులతో చర్చించారు.

శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు, నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట పిసిసి మెంబెర్ బత్తిని శ్రీనివాస్ రావు, తోట పవన్, శ్రీకర్, రవీందర్ రెడ్డి, కుమార్ యాదవ్, రాజు, సతీష్ మరియు అధికారులు ఉన్నారు.

అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు నాయిని..
అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి..