వర్ధన్నపేట/వరంగల్(రైట్స్ మీడియా): పర్వతగిరి మండల కేంద్రంలో మహాత్మ గాంధీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
పర్వతగిరిలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం, గ్రామ స్వరాజ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు . దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజంలో శాంతి, సోదరభావం, ఐక్యతను పెంపొందించేందుకు గాంధీజీ సిద్ధాంతాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయని తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో సహకరించిన విగ్రహ దాత స్వయం ప్రకాష్ ని అభినందించారు. గాంధీజీపై ఉన్న అభిమానంతో ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి ఉష దయాకర్, పర్వతగిరి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షురాలు సావిత్రి, గ్రామ సర్పంచ్ శంకర్, కల్లెడ పిఎసిఎస్ చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి పిఎసిఎస్ చైర్మెన్ అత్తి కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ బానోత్ సింగులాల్,పట్టణ మాజీ అధ్యక్షులు కుసం రామచందర్, ఏనుమాముల మార్కెట్ డాక్టర్ గొడుగు బిక్షపతి, డైరెక్టర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డుమెంబర్లు, మండల సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.