బుధవారం మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యాలు చేసారు.
నాపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ దొరకలేదు. నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారని అన్నారు.
మహిళలు స్వతంత్రంగా బతకాలని రాహుల్ చెపుతున్నారు.నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు. మల్లికార్జున ఖర్గేను కలిశాను. నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను. నాపై చర్యలు తీసుకో కంటే ముందు సీఎం పై చర్యలు తీసుకోవాలి. పదేళ్లు తానే సీఎం అని రేవంత్ ఎలా అంటారు. పొంగులేటి, బట్టి భార్య కమిషన్ల పైన కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి. దానిపైన ఎందుకు మాట్లాడటం లేదని అన్నారు.
చాలామంది రెడ్లు మాట్లాడితే వారి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు
మీడియా చిట్ చాట్ లో రేవంత్ పై ఫైర్.