కాకతీయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి MBA కోర్సులో స్పాట్ అడ్మిషన్లు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3, 2026 వరకు విద్యారణ్యపురి, హన్మకొండలో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. నరసింహాచారి తెలిపారు.
TG ICET–2026లో అర్హత సాధించిన అభ్యర్థులతో పాటు, అర్హత సాధించని అభ్యర్థులు కూడా స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు తమ అసలు ధ్రువపత్రాలతో పాటు, అవసరమైన ఫీజును వెంట తీసుకురావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ ద్వారా ప్రవేశం పొందిన విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు కాదని ప్రొఫెసర్ ఎస్. నరసింహాచారి స్పష్టం చేశారు.స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు TG ICET అధికారిక వెబ్‌సైట్‌తో పాటు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ నోటీసు బోర్డులో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.అర్హత ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రొఫెసర్ ఎస్. నరసింహాచారి కోరారు.
కాకతీయ యూనివర్సిటీలో MBA స్పాట్ అడ్మిషన్స్: కళాశాల ప్రిన్సిపాల్ ఫ్రొఫెసర్ నరసింహ చారి