మమ్మక్కల్ గ్రామానికి చెందిన ఓ వివాహితను బెదిరించి లైంగికంగా వేధించిన సీతారాంపూర్‌కు చెందిన బైక్ మెకానిక్ మెడిదొడ్డి సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఫోన్‌లు, మెసేజ్‌లు చేయడంతో పాటు భర్త లేని సమయంలో ఇంటికి వచ్చి బెదిరించి వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలు, సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. పరారీలో ఉన్న సాయికుమార్ గణేశ్‌నగర్‌లోని తన బైక్ మెకానిక్ షాపు వద్ద ఉన్నట్లు సమాచారం అందడంతో కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎ. నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు. బాధితురాలికి భరోసా సెంటర్ ద్వారా సహాయం అందించి, వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.