వర్ధన్నపేట మండల పరిధిలోని కట్ర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS) వ్యాయామ ఉపాధ్యాయుడు గుగులోతు సోమన్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సందర్భంగా జనగాం పట్టణంలోని కలం రోడ్డులో గల భక్త మార్కండేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు చందుపట్ల రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా
జనగామ లయన్స్ క్లబ్ సూర్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ.. కట్ర్యాల ZPHS పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ విద్యార్థులను క్రీడల్లో జిల్లా, రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. క్రమశిక్షణ, ఫిట్ నెస్, క్రీడా స్ఫూర్తిని విద్యార్థుల్లో నింపుతూ పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారని అన్నారు. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపిక కావడం మండలానికి, గ్రామానికి గర్వకారణమన్నారు. అనంతరం ఉపాధ్యాయుడిని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.