నరసరావుపేట(రైట్స్ మీడియా): నరసరావుపేట పట్టణంలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిల్ దొంగతనాలకు పోలీసులు చెక్ పెట్టారు. ప్రత్యేక దృష్టి సారించి సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించిన నరసరావుపేట 1వ పట్టణ పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 22 దొంగిలించబడిన మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.14 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నరసరావుపేట డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆదేశాల మేరకు నరసరావుపేట 1వ పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన యన్నబత్తుని మణికంఠ (22)ను సెప్టెంబర్ 6న సాయంత్రం 6.30 గంటలకు నరసరావుపేట టౌన్ ఫస్ట్ గేట్ నుంచి షాలేం నగర్ వైపు వెళ్లే రహదారిలో అరెస్ట్ చేశారు.