గోదావరి పుష్కరాల నాటికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని తెలిపారు. మే పునర్నిర్మాణ పనులు పూర్తయ్యేలా అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
ప్రతి నెలా పూర్తి చేయాల్సిన పనులకు సంబంధించి స్పష్టమైన లక్ష్యాలు, టైమ్‌లైన్ రూపొందించుకొని, వాటి ప్రకారం పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాలయ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేవాలయ నిర్మాణంలో నాణ్యమైన కృష్ణ శిలలను తెప్పించి అవసరమైన కార్వింగ్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రాతి పనులను వేగవంతం చేసేందుకు ముగ్గురు కాంట్రాక్టర్లతో పనులు కొనసాగించాలని, సివిల్ నిర్మాణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేయాలని సూచించారు. పురాతన నిర్మాణాల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆలయ చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ నాణ్యత, భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి పనిని పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్, దేవాలయ అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని, పనుల పురోగతిపై నిరంతరం సమీక్ష నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ ఈ రమేష్, పీఆర్ ఈఈ విద్యాసాగర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, దేవాలయ ఈఓ మహేష్, సివిల్, స్టోన్ వర్క్ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.