Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ

నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ
Share Short Clip Download PDF

భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా ఆవిష్కరించారు. నల్లబెల్లి గ్రామ రజక సంఘం అధ్యక్షులు రాపాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, రజక సంఘం నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సదాశివ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ దళపతి ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు నూతనకంటి ఆనందం, డాక్టర్ పొనుగోటి గోపాల్, డాక్టర్ అలుగునూరి విజయకుమార్, శ్రీమతి పొదిల్లా వసంత శోభన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ ముప్పు కృష్ణ మాట్లాడుతూ..

చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో చూపిన ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. భూస్వామ్య పెత్తందారుల దోపిడీ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఆమె ధైర్యంగా పోరాడారని పేర్కొన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

సదాశివ ఫౌండేషన్ చైర్మన్, విగ్రహ ఆవిష్కరణ ప్రారంభకులు డాక్టర్ సీహెచ్ దళపతి మాట్లాడుతూ..

చాకలి ఐలమ్మ పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం ఆమె సాగించిన పోరాటం చిరస్మరణీయమని తెలిపారు. ఐలమ్మ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమానికి నాగేల్లి జ్యోతి ప్రకాష్, ఉపసర్పంచ్ గుమ్మడి వేణు గౌరవ అతిథులుగా హాజరయ్యారు. కీర్తిశేషులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం విగ్రహ దాతలుగా ఆయన అన్న కుమారులు పెద్ది మహిపాల్ రెడ్డి, పెద్ది గణేష్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డివిజన్ అధ్యక్షులు కొల్లూరి లక్ష్మీనారాయణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చింతకింది కుమారస్వామి, దళిత సంఘం నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు బట్టు సాంబయ్య, సీపీఎం మండల కార్యదర్శి బొడిగె సమ్మయ్య, కడియాల మనోహర్, నర్సంపేట డివిజన్ నాయకులు మామిడాల నరసయ్య, పొదిల రామచందర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక రజక సంఘం నాయకులు ఆవునూరి కిషోర్, పొదిళ్ల శోభన్, బసవరాజు, భాస్కర్, నల్లబెల్లి గ్రామ రజక సంఘం నాయకులు పున్నం రాజ్‌కుమార్, ఫైనల్ జంపయ్య, జక్కయ్య, సారమల్లు, వైనాల మధు, అశోక్ తదితరులతో పాటు వివిధ గ్రామాల ప్రజా సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులు అర్పించారు.