Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు ఇంటర్నేషనల్ మార్కెట్లో మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయంగా కూడా మళ్లీ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎగబాకుతున్నాయి.

మళ్లీ  పెరుగుతున్న బంగారం ధరలు
Share Short Clip Download PDF

గత 10 రోజుల వ్యవధిలో కేవలం ఒక్క రోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. మిగతా అన్ని రోజులు భారీగా పెరుగుతూ పోయింది. ఈ క్రమంలో దాదాపు రూ. 6-7 వేల వరకు రేటు పెరిగిందని చెప్పొచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ పసిడి రేటు ఔన్సుకు 4600 డాలర్ల మార్కు దాటి ట్రేడవుతోంది. సిల్వర్ ధర 69 డాలర్ల మార్కు వద్ద ఉంది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం రూ. 95.73 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని పలు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు..

దేశ రాజధాని దిల్లీలో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1,47,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ. 1,60,630 వద్ద ఉంది. చెన్నై, ముంబై, బెంగళూరు, కోల్‌కతాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల పసిడి ధర వరుసగా రూ. 147100, రూ. 160480 వద్ద ట్రేడవుతోంది.అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతున్నాయి.

భారతదేశంలో ఏయే అంశాలు బంగారం ధరల్ని ప్రభావితం చేస్తాయి?

నేరుగా అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరలు, దేశీయంగా నేరుగా ప్రభావం చూపిస్తాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతాయి. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయి. ఇంకా ద్రవ్యోల్బణం, రూపాయి విలువ హెచ్చుతగ్గులు, ఫెడ్ వడ్డీ రేట్లు, ఇతర కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, ప్రభుత్వాలు విధించే సుంకాలు బంగారం, వెండి ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.

ప్రస్తుతం తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ లో పసిడి, వెండి ధరలు..

ప్రస్తుతం ఆగస్ట్ 22న ఉదయం 7.30 గంటల సమయంలో హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 1100 పెరిగి తులం రూ. 1,47,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1210 పెరగడంతో 10 గ్రాములకు రూ. 1,60,480 వద్ద ఉంది. మరోవైపు హైదరాబాద్ మార్కెట్‌లో సిల్వర్ రేటు ఆగస్ట్ 22న రూ. 5 వేలు పెరిగింది. దీంతో ప్రస్తుతం కేజీకి రూ. 2.65 లక్షల వద్ద ఉంది. ముందటి రోజు వెండి ధర ఏకంగా రూ. 10 వేలు పెరగ్గా, దానికి ముందు మాత్రం రూ. 5 వేలు పడిపోయింది. ఇక గత 2 రోజుల వ్యవధిలో చూస్తే సిల్వర్ రేటు రూ. 15 వేలు ఎగబాకింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కూడా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. అమరావతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 147100 వద్ద ఉండగా, 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 160480 వద్ద ఉంది.
ఇటీవల యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ పెరగడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మాత్రం అవి వరుసగా గరిష్ఠ స్థాయిల నుంచి దిగొస్తుండగా, గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు పుంజుకుంటున్నాయి. దీంతో ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలకు అనుగుణంగానే దేశీయంగా కూడా రేట్లు పుంజుకుంటున్నాయి.