గణపురం మండల కేంద్రంలోని కొత్తపల్లి లో BRS పార్టీ 14వ వార్డు సభ్యులు పబ్బ సమత రవీందర్ తమ తల్లిదండ్రులు కీ.శే. పబ్బ ప్రమీల రాములు జ్ఞాపకార్థం BRS నాయకుల ఆధ్వర్యంలో సోమవారం డప్పు కళాకారులకు ఉచితంగా డప్పులను బహుకరించడం జరిగింది. ఈ సందర్బంగా పబ్బ రవీందర్ మాట్లాడుతూ.. తరతరాలుగా మన జానపద కళలను, సంస్కృతిని తన గుండె చప్పుడుతో జీవం పోస్తున్న దళిత సోదరులకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు.
మన సాంప్రదాయ కళలను ప్రోత్సహించడం, కళాకారుల జీవనోపాధికి సాయపడటం, కళలకు, కళాకారులకు తగిన గౌరవాన్ని అందించడం, కళాకారుల సంక్షేమానికి, వారి ముఖాల్లో నవ్వులు చూడటానికి మేము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావు, BRS పార్టీ మండల అధ్యక్షులు మోతె కరుణాకర్ రెడ్డి, BRS గ్రామశాఖ అధ్యక్షులు హఫీజ్, వైనలా వెంకటేష్, BRS నాయకులు మామిండ్ల సాంబయ్య యాదవ్, గాజర్ల చింటూ గౌడ్, పిన్నింటి మణిదీప్ రావు, వల్లెపు జైపాల్, Md.వాజిత్,వేల్పుల చిన్న రాజయ్య, చెక్క రాజయ్య, చింతచర్ల ఆనందం, కొమురయ్య, డప్పు కళాకారులు బీరెల్లి రాజయ్య, సామర్ల రఘుపతి, బిరెల్లి సురేందర్, గుర్రం శంకర్, రాజుకుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
డప్పు కళాకారులకు ఉచితంగా డప్పుల పంపిణి
బీఆర్ఎస్ పార్టీ 14వ వార్డ్ సభ్యులు పబ్బ సమతా-రవీందర్ గౌడ్.