ఖమ్మం, అక్టోబర్ - 17(రైట్స్ మీడియా): జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగం, విక్రయాలను అరికట్టడానికి పోలీసు, ఎన్ఫోర్స్మెంట్, వైద్య-ఆరోగ్య, విద్య శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. శనివారం కలెక్టర్, కలెక్టరేట్ కాన్పరెన్స్ హాల్లో జిల్లా స్థాయి ఎన్కార్డ్ (NCORD) కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారుల నివేదిక ఆధారంగా జిల్లాలోని పురోగతిని సమీక్షించారు.
మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలనకు విస్తృత చర్యలు…
పటిష్ట నిఘా పెట్టాలి… శాఖలు సమన్వయంతో పనిచేయాలి: మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారితో సమీక్షించిన జిల్లా కలెక్టర్
పటిష్ట నిఘా పెట్టాలి… శాఖలు సమన్వయంతో పనిచేయాలి: మాదక ద్రవ్యాల నిర్మూలనపై అధికారితో సమీక్షించిన జిల్లా కలెక్టర్
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల వినియోగంతో చదువులో వెనుకబడి, భవిష్యత్తును కోల్పోతున్నారన్నారు. మత్తు కోసం డబ్బుకోసం నేరాలకు, దొంగతనాలకు పాల్పడే అవకాశం పెరుగుతుందని, కుటుంబాల్లో గొడవలు, మానసిక ఒత్తిడి, బంధాలు దెబ్బతింటాయని అన్నారు. మంచి సమాజం కొరకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 55 గంజాయి/డ్రగ్స్ కేసులు నమోదు చేయగా, 137 మంది నిందితులను అరెస్టు చేశారన్నారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు మార్గాలు, జిల్లాలోని అంతర్రాష్ట్ర రవాణా మార్గాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. కేసులలో మూలాలు, సరఫరాదారులు, కొనుగోలుదారులను పూర్తి స్థాయిలో గుర్తించి, ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మెడికల్ కళాశాల వద్ద ప్రత్యేక పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. స్కూల్స్ వద్ద చాక్లెట్ల అమ్మకాలపై నిఘా పెట్టాలని, తరచు దాడులు నిర్వహించాలని అన్నారు.
విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జిల్లాలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు 57 అవగాహన సదస్సులు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో యాంటీ-డ్రగ్ క్లబ్‌ల ఏర్పాటు, నిర్వహణను నిర్బంధం చేయాలన్నారు. కళాశాలల నుండి హై స్కూల్ ల వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.
డ్రగ్స్ బారిన పడిన వారికి కౌన్సెలింగ్, వైద్య చికిత్స, పునరావాసం కల్పించేందుకు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ప్రత్యేక డీ-అడిక్షన్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా షెడ్యూల్డ్ మత్తు బిళ్ళలు, ప్రిస్క్రిప్షన్ మందులు విక్రయించే మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1908 కి సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఈ సమావేశంలో శిక్షణా సహాయ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎం. ఫిరంగి, జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. రాజేశ్వర రావు, డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు దేవేందర్ రెడ్డి, అనిల్, ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. జి. వీరన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ వి. విజయ రాంకుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.