కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన ప్రత్యేక నిధులు విడుదల కాలేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు.
ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళయినా నిధులు శూన్యం: ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా
• నిజామాబాద్ అర్బన్ సమస్యలపై అనేకసార్లు లేఖలు అందజేశా: అసెంబ్లీలో ఎమ్మెల్యే ధన్ పాల్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌పై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి మూడు సార్లు లేఖలు ఇచ్చిన స్పష్టత లేదన్నారు. కళాభారతి, మాధవనగర్ బ్రిడ్జి పనులకు బిల్లులు చెల్లించలేక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేశారన్నారు.
అలాగే నిజామాబాద్ బస్టాండ్ పరిస్థితి మండల కేంద్రం బస్టాండ్‌లా ఉందని, దీని అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయిందని విమర్శించారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిపై గతంలో సమీక్షలు జరిగిన పరిస్థితుల్లో మార్పు లేదన్నారు.
ప్రధానంగా ఆసుపత్రి మార్చురీలో ఫ్రీజర్లు లేక దుర్వాసన వస్తోందని, జనరల్ వార్డుల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. 800 మంది విద్యార్థులకు ఒక బాలికల ప్రభుత్వ పాఠశాల (పబ్లిక్ స్కూల్స్) ఏర్పాటు ప్రతిపాదన చేసిన నిజామాబాద్‌లో ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.