Friday, 25 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వినాయక నిమజ్జనం శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

⏩అన్ని శాఖల సమన్వయంతో ముందుకు... రూట్ మ్యాప్ పరిశీలించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్.

వినాయక నిమజ్జనం శోభాయాత్రకు ఆటంకాలు లేకుండా చూడాలి: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
Share Short Clip Download PDF

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే వినాయకుడి శోభాయాత్రకు అధికారులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అధికారులకు సూచించారు. నగరంలోని దుబ్బ చౌరస్తా నుంచి లలితా మహల్, గాంధీ గంజ్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, పవన్ టాకీస్, గాజుల్ పేట్, పెద్ద బజార్, గోల్ హనుమాన్ మీదుగా వినాయకుల బావి వరకు శోభాయాత్ర రూట్ మ్యాప్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..

వినాయక నిమజ్జన శోభయాత్ర ఎంతో ప్రత్యేకమైనదన్నారు. సుమారు వందేళ్లుగా అనంత చతుర్దశి (ఈ నెల 25న) రోజున ప్రత్యేక రథంలో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని, విద్యుత్, కార్పొరేషన్, పబ్లిక్ హెల్త్, పోలీసు శాఖల సమన్వయంతో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా విద్యుత్ దీపాల ఏర్పాటు, రోడ్లపై గుంతల పూడ్చివేత, అవసరమైన చోట బీటీ రోడ్ల నిర్మాణం, వినాయకుల బావి వద్ద సౌకర్యాలు పరిశీలించడం జరిగిందన్నారు. మండప నిర్వాహకులు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్, పబ్లిక్ హెల్త్ ఈఈ తిరుపతి, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, పసునూరి రాము, జగదీష్ కులకర్ణి, బంటు ప్రీతి ప్రవీణ్, ప్రసూన శ్రీనివాస్, జ్యోతి మురళి, నాయకులు పంచరెడ్డి శ్యామ్, శ్రీనివాస్, మరావర్ కృష్ణ, మహిళా మోర్చ అధ్యక్షురాలు వనిత తదితరులు పాల్గొన్నారు.

Source / reference: Senior Journalist Nakka Rakesh, Nizamabad.